నచ్చిన ప్రదేశాలను చుట్టి రావాలని చాలామందికి ఉంటుంది. కానీ ‘టైం అంతా ఆఫీస్, ఇంటితోనే గడిచిపోతుంది’ అని అంటుంటారు. టార్గెట్లు, పర్సనల్ గోల్స్ అంటూ రొటీన్‌గా బతికేస్తున్నారు. ఏదైనా సెలవు దొరికితే.. వేరే పనులతోనే సరిపెట్టుకుంటున్నారు. ఇక ట్రావెలింగ్ చేసే తీరిక ఎక్కడిది?. అందుకోసమే ఈ ట్రావెల్ ప్లాన్ అందిస్తున్నాం. ఈ డేట్స్‌ను సేవ్ చేసుకుంటే చాలు.. ఎంచక్కా ఫ్యామిలీతో టూర్‌ను ఎంజాయ్ చేయొచ్చు. ఒక్కో నెలా, ఒక్కో ప్లేస్‌ను సెలెక్ట్ చేసుకొని, జీవిత కాలానికి సరిపడే జ్ఞాపకాలను సొంతం చేసుకోవచ్చు.
ప్రయాణాలు.. కొత్త ఉత్సాహాన్నిస్తాయి. కొత్త వ్యక్తులను పరిచయం చేస్తాయి. రొటీన్ లైఫ్ నుంచి బయటపడేలా చేస్తాయి. మనసుకు నచ్చిన ప్లేసుకు వెళ్తే.. జీవితానికి సరిపోయే జ్ఞాపకాలను సొంతం చేసుకోవచ్చు. ప్రయాణాలు చేయాలని.. ప్రకృతితో మమేకం కావాలని చాలామందికి ఉంటుంది. కానీ బిజీ లైఫ్ వల్ల అంత తీరిక ఉండదని చెప్తుంటారు. అలాంటివాళ్ల కోసమే ఈ ట్రావెల్ గోల్స్.
ఫిబ్రవరి
మరవంతే, కర్ణాటక
ప్రశాంతమైన వాతావరణంలో సేదతీరాలనుకునేవాళ్లకు బెస్ట్ ప్లేస్ ఇది. ఇక్కడి బీచ్‌లు ప్రత్యేక ఆకర్షణ. తెల్లటి ఇసుకతో బీచ్‌లు ఆకర్షిస్తాయి. టూరిస్టులు ఇష్టపడే ఈ ప్లేస్ ఉడిపి జిల్లాలో ఉంది. ఉడిపికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది. మరవంతేకు వెళ్లే టూరిస్టులు కోడి బీచ్ తప్పకుండా చూడాల్సిందే.
ప్లానింగ్
ఫిబ్రవరి 21 శుక్రవారం : మహా శివరాత్రి (హాలిడే)
ఫిబ్రవరి 22 శనివారం : వీకెండ్
ఫిబ్రవరి 23 ఆదివారం : వీకెండ్
మార్చి
వెలాస్, మహారాష్ట్ర
మహారాష్ట్రలో ఆలివ్‌రిడ్లే తాబేళ్లను ఆదరించే గ్రామాలెన్నో ఉన్నాయి. అందులో ప్రధానమైంది రత్నగిరి జిల్లాలోని వెలాస్. ఈ తాబేళ్లు వెలాస్ తీరానికి వచ్చి గుడ్లు పెడతాయి. గ్రామస్తులు, జంతు ప్రేమికులు తాబేళ్ల రక్షణ బాధ్యత తీసుకుంటారు. మార్చి నెలంతా తాబేళ్ల పండుగ నిర్వహిస్తారు. ఈ గ్రామానికి సమీపంలో దివేఆగర్, ఆంజర్లే, హరిహరేశ్వర్ తీరాల్లోనూ తాబేళ్ల సందడి కనిపిస్తుంది. ఒడిశాలో గోపాల్పూర్ బీచ్ మొదలు, గంజాం సమీపంలోని గహిరమాతా బీచ్ వరకు ఆలివ్‌రిడ్లే తాబేళ్లు లక్షలుగా తరలివస్తాయి. పూనే నుంచి రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తే వెలాస్కు వెళ్లొచ్చు.
ప్లానింగ్
మార్చి 7 శనివారం : వీకెండ్
మార్చి 8 ఆదివారం : వీకెండ్
మార్చి 9 సోమవారం : కాముడి దహనం (ఈ ఒక్క రోజు సెలవు పెట్టాలి)
మార్చి 10 మంగళవారం : హోలీ (హాలిడే)
ఏప్రిల్
సంబర్ సాల్ట్ లేక్, రాజస్తాన్
మనదేశంలోనే అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఇది. జైపూర్‌కు దగ్గరలో ఉంది. ఎటు చూసినా ఉప్పుతో కప్పి ఉంటుంది. కార్లు, బైక్‌లు, సొంత వెహికిల్స్‌తో లేక్ మొత్తం చుట్టిరావొచ్చు. అక్కడ పారాగ్లైడింగ్ కూడా చేయొచ్చు. ఈ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే రాజస్తాన్‌లోని మరికొన్ని ప్లేసులను చూసిరావొచ్చు.
ప్లానింగ్
ఏప్రిల్ 2 గురువారం : రామ నవమి (హాలిడే)
ఏప్రిల్ 3 శుక్రవారం : (సెలవు పెట్టాలి)
ఏప్రిల్ 4 శనివారం : వీకెండ్
ఏప్రిల్ 5 ఆదివారం : వీకెండ్
ఏప్రిల్ 6 సోమవారం : మహవీర్ జయంతి (హాలిడే)
అలాగే ఏప్రిల్10 శుక్రవారం : గుడ్ ఫ్రైడే (హాలిడే)
ఏప్రిల్11 శనివారం : వీకెండ్
ఏప్రిల్12 ఆదివారం : వీకెండ్
మే
లాంగ్వా, నాగాలాండ్
నాగాలాండ్ మోన్ జిల్లాలో అతిపెద్ద గ్రామం ఇది. చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్. కొన్యాక్ నాగాలాకు ప్రసిద్ధి. పచ్చబొట్టు పొడిచిన ముఖాలు, ఈకలను ధరించిన మనుషులు ఉంటారు. వీళ్ల వేషధారణ విచిత్రంగా ఉంటుంది. ఏప్రిల్, మే నెలలో ‘ఆవోలింగ్ మున్యూ’ అనే పండుగ జరుగుతుంది. ఆ టైంలో ఎక్కడ చూసిన కొన్యాక్ నాగాల సందడి ఉంటుంది. ఇక్కడ తయారయ్యే వస్తువులు డిఫరెంట్‌గా ఉంటాయి. మయన్మార్ తెగకు చెందినవాళ్లు కూడా కనిపిస్తారు.
ప్లానింగ్
మే 1 శుక్రవారం : లేబర్ డే (హాలిడే)
మే 2 శనివారం : వీకెండ్
మే 3 ఆదివారం : వీకెండ్
ఆ తరువాత
మే 7 గురువారం : బుద్ధ పూర్ణిమ (హాలిడే)
మే 8 శుక్రవారం : సెలవు పెట్టాలి
మే 9 శనివారం : వీకెండ్
మే 10 ఆదివారం : వీకెండ్జులై
సౌర్ గ్రామం, ఉత్తరాఖండ్
ఉత్తరాఖండ్ అనగానే హిమాలయాలు గుర్తొస్తాయి. ఒక్కసారి ఈ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే జీవితకాలమంతా ఎన్నో అనుభూతులు సొంతం అవుతాయి. ట్రెక్కింగ్, దట్టమైన అడవులు, అరుదైన జంతువులు ఇక్కడ కనిపిస్తాయి. సౌర్ గ్రామం చూడముచ్చటగా ఉంటుంది. దీనికి ‘ఘోస్ట్ విలేజ్’గా పేరుంది. మూడు వందల సంవత్సరాల క్రితం నుంచే ఈ ఊరు ఉందట. అలాంటి విలేజ్‌ను కొంతమంది ఆర్టిస్ట్‌లు ఆకర్షణీయమైన బొమ్మలు వేసి, గ్రామాన్ని అందంగా మార్చారు.
ప్లానింగ్
జులై 31 శుక్రవారం : బక్రీద్ (హాలిడే)
ఆగస్టు 1 శనివారం : వీకెండ్
ఆగస్టు 2 ఆదివారం : వీకెండ్
ఆగస్టు 3 సోమవారం : రక్షాబంధన్
ఆగస్టు
లెప్చజగట్, పశ్చిమ బెంగాల్
ఇది డెహ్రడూన్‌కు దగ్గరలో ఉంది. డెహ్రాడూన్ నుంచి గంటసేపు సాగే జర్నీ ఎంతో థ్రిల్ ఇస్తుంది. ఇది ఎత్తయిన హిల్‌స్టేషన్ కూడా. ఇక్కడి టాయ్ ట్రైన్ టూరిస్టులను బాగా ఆకట్టుకుంటుంది.
ప్లానింగ్
ఆగస్టు 29 శనివారం : వీకెండ్ (మొహర్రం)
ఆగస్టు 30 ఆదివారం : వీకెండ్
ఆగస్టు 31 సోమవారం : ఓనమ్ పండుగ (కేరళ వాళ్లు కాకుండా మిగతావాళ్లు సెలవు పెట్టాలి)
అక్టోబర్
వట్టకనాల్, తమిళనాడు
దట్టమైన అడవులు, కొండలు, గుట్టల మధ్య విహరించాలని ఉంటే.. వట్టకనాల్కు వెళ్లాల్సిందే. దీనికి ‘మినీ ఇజ్రాయిల్’ అని పేరుంది. ఇక్కడ ‘డాల్ఫిన్ నోస్’ అనే ప్లేస్ బాగా ఫేమస్. ఈ ట్రిప్‌ను ప్లాన్ చేసుకుంటే టెక్కింగ్తోపాటు వాటర్‌ఫాల్స్‌ను కూడా చూడొచ్చు.
ప్లానింగ్
అక్టోబర్ 2 శుక్రవారం : గాంధీ జయంతి (హాలిడే)
అక్టోబర్ 3 శనివారం : వీకెండ్
అక్టోబర్ 4 ఆదివారం : వీకెండ్
ఆ తరువాత
అక్టోబర్ 24 శనివారం : వీకెండ్
అక్టోబర్ 25 ఆదివారం : దసరా
నవంబర్
కద్మత్ ద్వీపం, లక్ష్వదీప్
పచ్చదనంతో కనిపించే కొబ్బరిచెట్లు.. అలలపై తేలియాడే బోట్లు… ఆకట్టుకునే ఇసుక తిన్నెలు కద్మత్ ద్వీపం సొంతం. చాలామందికి ఫేవరెట్ డెస్టినేషన్ ఇది. ఒకసారి కద్మత్ ద్వీపానికి వెళ్తే.. బోలెడు బీచ్‌లను చుట్టిరావొచ్చు. లక్షద్వీప్‌కు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కద్మత్‌లో బీచ్ రిసార్ట్లు కూడా ఉన్నాయి.
ప్లానింగ్
నవంబర్ 13 శుక్రవారం : ధన్తేరస్
నవంబర్ 14 శనివారం : వీకెండ్
నవంబర్ 15 ఆదివారం : వీకెండ్
డిసెంబర్
ఆలి, ఉత్తరాఖండ్
ఇక్కడి ఇళ్లు, చెట్లు, కొండలపై దట్టమైన మంచు.. థ్రిల్‌కు గురిచేసే రోప్‌వేలతో వెల్కమ్ చెప్తుంది. ప్రకృతి ప్రేమికులు ఆలి దృశ్యాలను చూసేందుకు ముచ్చటపడతారు.
ప్లానింగ్
డిసెంబర్ 25 శుక్రవారం : క్రిస్మస్ (హాలిడే)
డిసెంబర్ 26 శనివారం : వీకెండ్
డిసెంబర్ 27 ఆదివారం వీకెండ్
see also: సూర్యగ్రహణం ఎఫెక్ట్ : చూపు పోగొట్టుకున్నారు