పంజాగుట్ట, వెలుగు: యూట్యూబర్అన్వేశ్(నా అన్వేషణ)పై పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. హిందూ దేవుళ్లపై అన్వేశ్ గతేడాది చేసిన అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి. దీనిపై సినీ నటి కరాటే కల్యాణి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అన్వేశ్ పై చర్యలు చేపట్టారు. అతడికి చెందిన కొన్ని ఇన్స్టా, యూట్యూబ్ ఛానళ్లను తొలగించారు. అన్వేశ్ విదేశాల్లో ఉండటం వల్ల కేసు దర్యాప్తు ముందుకు కొనసాగకపోవడంతో లుకౌట్నోటీసు జారీ చేశామని పోలీసులు తెలిపారు. ఎవరైన ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా కామెంట్స్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
