హైదరాబాద్ సిటీ, వెలుగు : నగరంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. వర్షాలు పడిన సమయాల్లో ఈదురుగాలులకు ఎక్కడి నుంచి ఏ వైరు తెగి మీద పడుతుందో తెలియడం లేదు. చాలా చోట్ల కరెంట్‌లైన్లు లూజ్అయినా పట్టించుకోవడం లేదు. చాలా చోట్ల చెట్ల మధ్య నుంచే లైన్లు వెళ్తుండడంతో ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందోనని భయపడాల్సి వస్తున్నది.
గత ఏడాది రామాంతాపూర్‌లో కిందకు వేలాడుతున్న కరెంట్వైర్లను ఇనుప రథం తాకడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కొంతకాలం వైర్లు తొలగించి హడావుడి చేసిన విద్యుత్‌శాఖ యథావిధిగా సైలెన్స్అయిపోయింది. ఇప్పుడు సిటీలో వైర్లు మునుపటి లాగే కనిపిస్తున్నాయి..అవి మీద పడి అమాయక జనాలు ప్రాణాలు పోగొట్టుకుంటూనే ఉన్నారు.
– హైదరాబాద్ సిటీ, వెలుగు ఫొటోగ్రాఫర్స్
