IND vs ENG 2025: ఇది కదా టెస్ట్ క్రేజ్: లార్డ్స్ స్టేడియం హౌస్ ఫుల్.. 54 కోట్లకు చేరిన వ్యూవర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌

IND vs ENG 2025: ఇది కదా టెస్ట్ క్రేజ్: లార్డ్స్ స్టేడియం హౌస్ ఫుల్.. 54 కోట్లకు చేరిన వ్యూవర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్ లో జరుగుతున్న మూడో టెస్టు క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది. టెస్ట్ క్రికెట్ కు ఆదరణ లేదనుకునే ఈ రోజుల్లో అది కేవలం అపోహ మాత్రమే అని లార్డ్స్ టెస్ట్ నిరూపించింది. కోహ్లీ, రోహిత్ శర్మ లేకపోయినా ఇంగ్లాండ్, ఇండియా మ్యాచ్ చూడడానికి ప్రేక్షకులు ఎగబడ్డారు. తొలి నాలుగు రోజుల్లో ఈ మ్యాచ్ చూడడానికి ప్రేక్షకులు అత్యధిక సంఖ్యలో హాజరయ్యారు. ఐదో రోజు(సోమవారం) మాత్రం లార్డ్స్ స్టేడియం ప్రేక్షకులతో నిండిపోవడం విశేషం. వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ చివరి రోజు ఒక్క సీట్ కూడా ఖాళీగా లేకపోవడం ఈ మ్యాచ్ క్రేజ్ తెలియజేస్తుంది. 

చివరి రోజు మ్యాచ్ రసవత్తరంగా మారడం.. ఇంగ్లాండ్ క్రికెట్ ఫ్యాన్స్ టెస్ట్ క్రికెట్ పై ఎక్కువగా ఆసక్తి చూపించడం.. ఐకానికి లార్డ్స్ స్టేడియంలో మ్యాచ్ జరగడంతో సోమవారం (ఐదవ రోజు) హౌస్ ఫుల్ అయింది. అంతేకాదు వ్యూయర్ షిప్ లోనూ రికార్డ్ సృష్టిస్తోంది. జియో హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ అవుతున్న ఈ మ్యాచ్ ను చూస్తున్న వారి సంఖ్య 54 కోట్లకు చేరడం విశేషం. టీమిండియా విజయానికి మరో 53 పరుగులు కావాల్సిన దశలో జడేజా (41), బుమ్రా(4) జట్టు విజయం కోసం పోరాడుతున్నారు. ఈ సమయంలో వీక్షకుల సంఖ్య 54 కోట్లు దాటడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 

Also Read:-ఇంగ్లాండ్ చీప్ ట్రిక్స్.. పరుగు తీస్తుంటే జడేజాను అడ్డుకున్న కార్స్

ఈ మ్యాచ్ విషయానికి వస్తే 193 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా ప్రస్తుతం 8 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. క్రీజ్ లో జడేజా (41), బుమ్రా (4) ఉన్నారు. 112 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన వీరిద్దరి జోడీ 29 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ముందుకు తీసుకెళ్తున్నారు. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 387 పరుగులు చేయగా.. ఆతర్వాత ఇండియా కూడా సరిగ్గా 387 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో 192 పరుగులకే ఆలౌట్ అయింది.