పేషెన్స్ ఈజ్ ద కీ.. సహనమే విజయానికి తొలిమొట్టు అని ఊరికే అనలేదు. పరిస్థితులు ఎలా ఉన్నా పట్టుదలతో.. నమ్మిన లక్ష్యం కోసం ఓపికగా, సహనంతో నిలిచేవాడే గెలుస్తాడు అనటానికి సరైన ఉదాహరణ ఈ చెస్ ఛాంపియన్ అరవిద్ చితంబరం. మూడేళ్లకే నాన్నను కోల్పోయి భవిష్యత్తు అంధకారంలో ఉన్న కుటుంబం నుంచి ప్రపంచ ఛాంపియన్ గా ఎదిగాడంటే అరవింద్ సక్సెస్ స్టోరీ వెనుక ఉన్న జర్నీ ఏంటో తెలుసుకోవాల్సిందే.
చితంబరం ప్రయత్నంలో పట్టువదలి విక్రమార్కుడే. ఎందుకంటే టైటిల్డ్ ట్యూస్డేస్, చెస్ డాట్ కామ్ వంటి ఎలైట్ ఆన్లైన్ ఈవెంట్స్ లో పాల్గొంటూ కంటిన్యూగా ఓడిపోతున్నా విశ్వాసం కోల్పోకుండా ప్రయత్నించాడు. ఎట్టకేలకు డ్రీమ్ హాక్ అట్లాంటాలో జరిగిన ఈవెంట్ లో విజయం సాధించాడు. దీంతో 2026 ఈస్పోర్ట్స్ చెస్ వరల్డ్ కప్ (2026 Esports Chess World Cup) కు క్వాలిఫై అయిన తలి ఇండియన్ గా రికార్డు సృష్టించాడు. ఈ ఈవెంట్ ఆగస్టు 11 నుంచి 15 వరకు ప్యారిస్ లో జరగనుంది.
తాత కోసం ఆడిన ఆట.. ఛాంపియన్ ను చేసింది..
అరవింద్ మూడేళ్ల వయసులో ఉన్నపుడు ముధరై లోని తిరునగర్ లో ఊహించని విషాద ఘటన చోటుచేసుకుంది. ఆ పసితనంలోనే తండ్రిని కోల్పోయాడు అరవింద్. ఏమీ తెలియని వయసులో అందరు పిల్లలగా ఫ్రెండ్స్ తో గల్లీ క్రికెట్ ఆడేవాడు. అప్పుడే తన జీవితంలో తన తాత రూపంలో అద్భుతం జరిగినట్లు చెప్తున్నాడు.
తనతో క్రికెట్ఆడాలని తన తాతను అడిగేవాడట. ఈ వయసులో చేతకాని వాడిని.. కనీసం నడవలేను.. ఇక క్రికెట్ ఏం ఆడగలను అని తాత చెప్పేవాడట. కానీ నీకు చెస్ ఎలా ఆడాలో నేర్పిస్తా.. అంటూ తాత చదరంగం ఆట నేర్పించాడట. తాత దగ్గర నేర్చుకున్న మెళకువలతో చెస్ పైన ఆసక్తి పెంచుకున్నాడు. చెస్సును తన డైలీ రొటీన్ లో భాగంగా మార్చుకున్నాడు.
అమ్మ ప్రోత్సాహం:
అక్కడి నుంచి మొదలైన ప్రయాణం.. ఎప్పుడూ చెస్ బోర్డుతోనే కొనసాగింది. ఎప్పుడూ చెస్ ఆడుతూ ఉండటం, వివిధ మ్యాచ్ లు చూస్తూ.. ఎత్తులకు పై ఎత్తులు వేయడం ఏంటోతెలుసుకోవడం ఇదే పని అరవింద్ కు.
భర్త దూరమైనా తన కొడుకు కోసం తన కష్టాలతో కూడిన ప్రయాణాన్ని కొనసాగించింది అరవింద్ తల్లి దీవనై. LIC (ఎల్ఐసీ) ఏజెంట్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేది. రోజు రోజుకూ అరవింద్ చెస్ లో పట్టు సాధిస్తుండటంతో అతనిపై నమ్మకం ఏర్పడింది ఆమెకు. అప్పటి వరకు ఆటలు వద్దు చదవాలని చెప్పిన ఆమె.. చెస్ ను కెరీర్ గా ఎంచుకొమ్మని.. ప్రొఫెషనల్ చెస్ గేమ్ కోసం తనవంతుగా సపోర్ట్ చేస్తానని హామీ ఇచ్చింది. అక్కడి నుంచి వెనుదిరగకుండా ముందుకు వెళ్లిన అరవింద్.. ఈ స్పోర్ట్స్ వరల్డ్ కప్ 2026 కు ఎంపిక అయ్యే వరకు తన ప్రయత్నాన్ని ఆపలేదు.
