బ్యూటీ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బోలెడు జాబ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

బ్యూటీ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బోలెడు జాబ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • కరోనా తర్వాత పెరుగుతున్న ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ స్టోర్లు 
  • బ్యూటీ అడ్వైజర్లు, సేల్స్ రోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫుల్ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: హెయిర్ కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్కిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కలర్ కాస్మోటిక్స్‌ వంటి సెగ్మెంట్లలో బోలెడు జాబ్స్ ఉన్నాయి. కరోనా తర్వాత ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ కంపెనీలు కూడా  ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ స్టోర్లు ఓపెన్ చేయడం పెంచాయి. దీంతో బ్యూటీ ఇండస్ట్రీలో  మ్యాన్‌పవర్‌‌కు డిమాండ్ రికార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెవెల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకుంది. బ్యూటీ అడ్వైజర్లు, సేల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్సన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బ్యూటీషియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి రోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 35–50 శాతం పెరిగిందని మ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రూప్ ఇండియా,  టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టాఫింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాప్ ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు వెల్లడించారు.  బ్యూటీ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాస్మోటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెగ్మెంట్లలో గత రెండేళ్లలో సుమారు ఐదు నుంచి ఆరు లక్షల మందికి ఉపాధి దొరికిందని అంచనా.  ఇండస్ట్రీ వర్గాల అంచనాల ప్రకారం, కరోనా తర్వాత ఈ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అయితే ఏటా 13–14 శాతం గ్రోత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను , ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అయితే  35 శాతం గ్రోత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నమోదు చేశాయి.  

నైకా, సెఫోరా, మామాఎర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సుగర్ కాస్మోటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి కంపెనీలు ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ స్టోర్లను కూడా ఏర్పాటు చేస్తుండడంతో ఉద్యోగుల అవసరం పెరుగుతోంది. మరోవైపు హిందుస్తాన్ యూనిలీవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రోక్టర్ అండ్ గ్యాంబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లోరియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి టాప్ కంపెనీలు కూడా కొత్త బ్యూటీ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను తెస్తున్నాయి.  తమ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్, ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విస్తరిస్తున్నాయి. ‘బ్యూటీ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పనిచేసేందుకు అవసరమయ్యే మ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గత  రెండేళ్లలో భారీగా పెరిగింది’ అని ఈవైకు చెందిన అంగ్షుమన్  భట్టాచార్య అన్నారు. 

చాలా ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ బ్రాండ్లు ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా విస్తరిస్తుండడంతో బ్యూటీ అడ్వైజర్లు, సేల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు డిమాండ్ పెరిగిందని చెప్పారు. హిందుస్తాన్ యూనిలీవర్ వంటి కంపెనీలు కూడా విస్తరణపై ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టడంతో మరిన్ని జాబ్స్ క్రియేట్ అవుతున్నాయని చెప్పారు. కంపెనీలు ఏటా 10,000 నుంచి 20 వేల రిటైల్ అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెట్లను ఏర్పాటు చేస్తున్నాయని, వీటిలో పనిచేసేందుకు భారీగా మ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పవర్ అవసరమని అన్నారు. ఇంకా బ్యూటీ అడ్వైజర్ రోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 70–80‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాతం ఉద్యోగాలు మహిళల కోసమే ఉన్నాయి. సేల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 30 శాతం, బ్యూటీషియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 80 శాతం వాటా వీరి కోసమే ఉన్నాయి.