ప్రేమ పేరుతో యువతిని మోసం చేసి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్ చేస్తున్న యువకుడితో పాటు ఇందుకు సహకరించిన అతడి తల్లిని నాచారం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సీఐ మహేశ్కథనం ప్రకారం..ఈసీఐఎల్ ఉండే ఓ యువతి(20) ఓ జూనియల్ కాలేజీలో రెండేళ్ల క్రితం ఇంటర్ చదువుకుంది. నాచారంలోని హెచ్ఎంటీనగర్ లో ఉండే షాలెహ షాహిన్(45) అనే మహిళ యువతి చదువుకున్న కాలేజీలో రిసెప్షనిస్ట్ గా పనిచేసి మానేసింది. షాహిన్ కు ఆ యువతితో పరిచయం ఉంది. తనకు ఆర్థిక ఇబ్బందులున్నాయని చెప్పి షాహిన్ ఆ యువతిని అప్పుడప్పుడు డబ్బులు అడిగేది. షాహిన్ డబ్బు అడిగినప్పుడల్లా ఆ యువతి ఆమె ఇంటికి వెళ్లి ఇచ్చేది. ఈ క్రమంలో షాహిన్ పెద్ద కొడుకు మోహద్ అబ్దుల్ మాజిద్(19)తో ఆ యువతికి పరిచయం ఏర్పడింది. మాజిద్ యువతిని ప్రేమిస్తున్నానని చెప్పి ఆమెకు దగ్గరయ్యాడు. ఇద్దరూ కొంతకాలం ప్రేమించుకున్నారు. ఆ తర్వాత మాజిద్ యువతితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. కొడుకు ప్రవర్తన గమనించిన తల్లి షాహిన్ కూడా అతడికి సహకరించింది. మాజిద్, షాహిన్ ఏడాది కాలంగా యువతిని బెదిరించి నుంచి సుమారు 7.5 తులాల బంగారు నగలు, రూ.60వేల డబ్బు దోచుకున్నారు. ఈ బ్లాక్ మెయిల్ ను తట్టుకోలేక యువతి ఈ నెల 1న నాచారం పోలీసులకు జరిగిన విషయం చెప్పి కంప్లయింట్ చేసింది. బాధితురాలి కంప్లయింట్ అందుకున్న పోలీసులు మంగళవారం షాహిన్, మాజిద్ ను అరెస్టు చేశారు. వారి దగ్గరి నుంచి 36 గ్రాముల బంగారు నగలు, ఓ హోండా ఆక్టీవా, ఓ కారు, స్మార్ట్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇద్దరిని రిమాండ్ కు తరలించినట్టు సీఐ మహేశ్తెలిపారు.
ప్రేమ పేరుతో మోసం
- హైదరాబాద్
- June 5, 2019
మరిన్ని వార్తలు
-
త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం : కె. లక్ష్మణ్
-
Summer Fruits : ఫ్రూట్స్ ఎలా పడితే అలా తినొద్దు.. టెస్ట్ చేయండి.. క్లీన్ చేసి తినండి.. !
-
Health Tip : ట్రాఫిక్ లో కారులో ఈ చిన్న చిన్న ఎక్సర్ సైజ్ చేయండి.. మంచి రిలాక్స్..!
-
Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
లేటెస్ట్
- V6 DIGITAL 14.05.2024 AFTERNOON EDITION
- బీహార్‌లో బీజేపీ ముఖ్య నేత మృతి
- త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం : కె. లక్ష్మణ్
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- Central Govt New OTT Platform: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను తీసుకురానున్న కేంద్రం.. రెండేళ్ల పాటు ఉచితం
- Summer Fruits : ఫ్రూట్స్ ఎలా పడితే అలా తినొద్దు.. టెస్ట్ చేయండి.. క్లీన్ చేసి తినండి.. !
- Health Tip : ట్రాఫిక్ లో కారులో ఈ చిన్న చిన్న ఎక్సర్ సైజ్ చేయండి.. మంచి రిలాక్స్..!
- వారణాసిలో నామినేషన్ వేసిన మోదీ
- Double Ismart Teaser: 85 సెకన్ల మాస్ ఫీస్ట్ లోడింగ్.. డబుల్ ఇస్మార్ట్ టీజర్ అప్డేట్
- దారుణం : ఇంట్లో పడుకోబెట్టిన ఐదు నెలల పసికందుపై కుక్కల దాడి.. బాలుడు మృతి
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్‌సభ పోలింగ్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్‌పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- ఉద్యోగిపై కాటు వేసిన పాము
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!