నాగ చైతన్య కెరీర్‌లో మరపురాని మైల్ స్టోన్ మూవీ ‘లవ్ స్టోరీ’. సాయి పల్లవి హీరోయిన్‌గా శేఖర్ కమ్ముల రూపొందించిన ఈ చిత్రం ఐదేళ్ల క్రితం కరోనా సమయంలో విడుదలై సూపర్ హిట్ అందుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ చిత్రంలో నాగ చైతన్య తెలంగాణ గ్రామానికి చెందిన ఫోక్ డ్యాన్సర్ పాత్రలో కొత్తగా కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు.
సాయి పల్లవి తనదైన సహజ నటనతో ఇంప్రెస్ చేసింది. గ్రామీణ తెలంగాణ జీవన శైలిని తెరపై ఆవిష్కరించారు దర్శకుడు శేఖర్ కమ్ముల. సంగీత దర్శకుడు పవన్ అందించిన పాటలు ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉన్నాయి. నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు ఒక ప్రేమకావ్యంగా తీర్చిదిద్దిన ఈ చిత్రానికి రీ రిలీజ్‌లోనూ మంచి ఆదరణ దక్కుతుందని మేకర్స్ భావిస్తున్నారు.
