సరికొత్తగా కనిపిస్తున్న మహేశ్ బాబు

సరికొత్తగా కనిపిస్తున్న మహేశ్ బాబు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కొత్త కొత్త లుక్స్ తో కనిపిస్తూ.. అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా హెయిర్ లుక్ ను మార్చేసుకున్నారు. సరికొత్తగా కనబడుతున్నారు. నెటెడ్ టీ షర్టుతో పైకి దువ్వీ దువ్వనట్టుగా జట్టు ఉంది. అక్కడక్కడ తెల్ల జుట్టు కనిపిస్తోంది. అంతేగాకుండా పల్చటి గడ్డం, షార్ప్ లుక్స్ తో డిఫరెంట్ గా కనబడుతున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను మహేశ్ బాబు స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ కొత్త లుక్ ను తాను ఇష్ట పడుతున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. మహేశ్ ఫొటోను చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. గతంలోని ఆయన లుక్స్ ను షేర్ చేస్తున్నారు. ఈ ఫొటోకు కొన్ని గంటల్లోనే వేల లైకులు వస్తున్నాయి. 

ఇక మహేశ్ బాబు విషయానికి వస్తే.. ఆయన నటించిన సర్కారీ వారి పాట ఘన విజయం సాధించింది. ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లి వచ్చారు. ఆగస్టు 09వ తేదీన మహేశ్.. గ్రాండ్ గా బర్త్ డే సెలబ్రేషన్ చేసుకున్నారు. ఈ సమయంలో మహేశ్ కు సంబంధించిన అప్ కమింగ్ ఫిల్మ్ న్యూస్ వస్తుందని ఆశించారు. కానీ అలాంటిదేమి జరగలేదు. అయితే.. ఆయన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో నటించనున్నారు. చిత్రం SSMB28 ఎప్పుడు ప్రారంభం అవుతుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా.. మహేశ్ బాబు కు సంబంధించిన న్యూ లుక్ ఆ చిత్రంలోనేదేనని తెలుస్తోంది. అధికారికంగా వెల్లడిస్తే కాని.. సినిమా షూటింగ్ పై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.