ఇండియాకు గ్యాస్ కష్టాలు.. ఖతార్లోని రాస్ లఫాన్పై ఇరాన్ దాడితో పెరగనున్న కొరత

ఇండియాకు గ్యాస్ కష్టాలు.. ఖతార్లోని రాస్ లఫాన్పై ఇరాన్ దాడితో పెరగనున్న కొరత
  • ప్రపంచ ఎల్ఎన్​జీ సరఫరాలో 20 శాతం ఇక్కడి నుంచే
  • భారత్ గ్యాస్ అవసరాల్లో 40 నుంచి 47 శాతం ఖతార్ నుంచే
  • ఎరువులు, విద్యుత్తు, వంటగ్యాస్, పరిశ్రమలపై తీవ్ర ఎఫెక్ట్!
  • రాస్ లఫాన్ పూర్తిగా ధ్వంసమైతే పునర్‌‌‌‌‌‌‌‌నిర్మాణానికి 15 ఏండ్లు!
  • ఇరాన్ వెంటనే దాడులు ఆపాలని 12 అరబ్ దేశాల పిలుపు

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో చాలా కీలకమైన గ్యాస్, చమురు క్షేత్రాలపై ఇరాన్ బుధవారం అర్ధరాత్రి భారీ స్థాయిలో దాడులు చేసింది. తమ అగ్రనేత అలీ లారిజానీ, నిఘా మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ హత్యకు ప్రతీకారంగా ఈ అటాక్స్ చేపట్టింది. ముఖ్యంగా ఖతార్ దేశ ఈశాన్య తీరంలో ఉన్న రాస్ లఫాన్ ఇండస్ట్రీయల్ సిటీపై క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో ప్రపంచ గ్యాస్​ ఉత్పత్తిలో ప్రధానమైన ఆ ఇండస్ట్రియల్ సిటీ తీవ్రంగా దెబ్బతిన్నది.

ఖతార్ ప్రభుత్వ రంగ సంస్థ ఖతార్ ఎనర్జీ సీఈవో సాద్ అల్-కాబీ స్పందిస్తూ ఈ దాడులు దేశ ఎల్​ఎన్​జీ ఎగుమతి సామర్థ్యంలో 17 శాతాన్ని దెబ్బతీశాయని, గ్యాస్ క్షేత్రాల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగాయని వెల్లడించింది. దీంతోపాటు యూఏఈలోని బాబ్ ఆయిల్ ఫీల్డ్, హబ్‌‌‌‌‌‌‌‌షాన్ గ్యాస్ కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌లపై కూడా ఇరాన్​ మిసైల్స్ ప్రయోగించింది. సౌదీ అరేబియాకు చెందిన అరామ్‌‌‌‌‌‌‌‌కో రిఫైనరీపై కూడా అటాక్ ​చేసింది. ఈ సంక్షోభం మరికొంత కాలం కొనసాగితే భారత్ కష్టాలు పెరిగే ప్రమాదం ఉంది.

30 దేశాలకు ఇక్కడి నుంచే గ్యాస్
ఖతార్ రాజధాని దోహాకు 80 కి.మీ. దూరంలో పర్షియన్ గల్ఫ్ తీరంలో ఉన్న రాస్ లఫాన్ నగరం ప్రపంచ గ్యాస్ వాణిజ్యానికి ఆయువుపట్టు. దాదాపు 20 ఏళ్ల పాటు నిర్మించుకొన్న ఈ పారిశ్రామిక హబ్ ఏటా 77 మిలియన్ టన్నుల ఎల్ఎన్​జీ ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడ నుంచి 30 దేశాలకు పైగా గ్యాస్ ఎగుమతి అవుతుంది. జపాన్, దక్షిణ కొరియా, చైనా, ఐరోపా, భారత్ వంటి దేశాలు ఇక్కడి గ్యాస్‌‌‌‌‌‌‌‌పై ఆధారపడ్డాయి. భారత్ కొనే ఎల్ఎన్​జీలో 47 శాతం ఖతార్ నుంచే వస్తుంది.

భారత్ గ్యాస్ ​అవసరాల్లో 40% ఖతార్ నుంచే..
భారత్ తన గ్యాస్ అవసరాల్లో 50 శాతం దిగుమతుల ద్వారా తీర్చుకుంటుంది. ఇందులో 40 శాతం ఖతార్ నుంచే వస్తున్నది. ఇది మొత్తం గ్యాస్ వినియోగంలో దాదాపు 20 శాతానికి సమానం. దేశంలో ఇప్పటికే రోజుకు 47.4 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ కొరత కారణంగా రసాయన ఎరువుల ఉత్పత్తి తగ్గుతుంది. వ్యవసాయంపై డెరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. పారిశ్రామిక ఉత్పత్తి పడిపోతుంది. సీఎన్​జీ, పీఎన్​జీ గ్యాస్ ధరలు భారీగా పెరుగుతాయి. గ్యాస్​తో విద్యుత్తు ఉత్పత్తి చేసే ప్లాంట్లకు ఇబ్బంది వస్తాయి.  దీంతో ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలు ఇప్పటికే కొత్త మార్కెట్ల నుంచి గ్యాస్ సేకరించే యత్నాలు మొదలుపెట్టాయి.

గ్యాస్​ ధరలు భారీగా పెరిగే ప్రమాదం
రాస్ లఫాన్ పూర్తిగా ధ్వంసమైతే పునర్‌‌‌‌‌‌‌‌నిర్మాణానికి 10 ఏండ్ల నుంచి 15 ఏండ్లు పట్టొచ్చు. అంతవరకు ప్రపంచ ఎల్ఎన్​జీ సప్లైలో 20% అంతరాయం కొనసాగుతుంది. గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఎరువుల కొరత వల్ల వ్యవసాయ ఉత్పత్తి పడిపోతుంది. పరిశ్రమలు మూతపడే ప్రమాదం ఉంటుంది. గ్యాస్ తో నడిచే విద్యుత్తు ప్లాంట్లు మూతపడతాయి. ఆల్టర్నేట్ కనుగొనడానికి భారత్​కు అయిదారు ఏండ్లు పట్టవచ్చని నిపుణులు చెప్తున్నారు.

ఎల్పీజీ కొరత ముప్పు
యుద్ధం వల్ల ఎల్​పీజీ సరఫరాకు కూడా ముప్పు పొంచి ఉంది. పెట్రోనెట్ ఎల్​ఎన్​జీ సంస్థ ఏటా ఖతార్ నుంచి 7.5 మిలియన్ టన్నుల గ్యాస్ దిగుమతి చేసుకుంటుంది. గెయిల్, జీఎస్​పీసీ కూడా ఖతార్​తో దీర్ఘకాలిక ఒప్పందాలు కలిగి ఉన్నాయి. రాస్​ లఫాన్​పై దాడి నేపథ్యంలో పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ గురువారం మీడియాతో మాట్లాడారు.

ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే ఆలోచన లేదన్నారు. హార్మూజ్ లో ఆగిపోయిన 22 నౌకలను ముందుకు వెళ్లనిచ్చేలా ఇరాన్​తో చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు. ప్రత్యామ్నాయంగా రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లు పెంచుతున్నట్టు చెప్పారు.