IPL 2024: లక్నో సూపర్ జయింట్స్ అసిస్టెంట్ కోచ్‌గా దక్షిణాఫ్రికా దిగ్గజం

IPL 2024: లక్నో సూపర్ జయింట్స్  అసిస్టెంట్ కోచ్‌గా దక్షిణాఫ్రికా దిగ్గజం

దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ లాన్స్ క్లూసెనర్ లక్నో సూపర్ జెయింట్స్‌ అసిస్టెంట్ కోచ్‌గా నియమించబడ్డాడు. రాహుల్ కెప్టెన్ గా ఉంటున్న ఈ జట్టుకు 2024 సీజన్ లో ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ తో కలిసి క్లూసెనర్ తమ బాధ్యతలను పంచుకుంటాడు. ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్, అసిస్టెంట్ కోచ్ శ్రీధరన్ శ్రీరామ్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, స్పిన్-బౌలింగ్ కన్సల్టెంట్ ప్రవీణ్ తాంబే, ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ వ్యూహాత్మక సలహాదారు MSK ప్రసాద్‌లతో కూడిన LSG సిబ్బందిలో క్లూసెనర్ చేరనున్నారు.  

"ఐపీఎల్ 2024 సీజన్ లో క్లూసెనర్ సేవలను వినియోగించుకోవాలనుకుంటున్నాం. లక్నో ఫ్రాంచైజీకి గొప్ప సహకారం, సపోర్ట్ అందిస్తాడని లక్నో సూపర్ జెయింట్స్ తమ అధికారిక వెబ్‌సైట్‌లోని ప్రకటనలో తెలిపారు.1996 నుండి 2004 వరకు క్లూసెనర్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్‌గా దక్షిణాఫ్రికా తరపున 49 టెస్టులు మరియు 171 వన్డేలు ఆడాడు. ఈ మాజీ సఫారీ ఆటగాడు 2019 నుండి 2021 వరకు ఆఫ్ఘనిస్తాన్ ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే జట్ల బ్యాటింగ్ కోచ్‌గా పని చేసిన అనుభవం ఉంది.

also read  : మీకో దండం.. మీ రాజకీయాలకో దండం : బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ సంచలన ప్రకటన
 

లక్నో సూపర్ 2022 లో ఐపీఎల్ లో కొత్త జట్టుగా చేరింది. 2022, 2023 లో వరుసగా రెండు సీజన్ లలో ప్లే ఆఫ్ కు చేరిన జట్టుగా నిలిచింది. మార్చి 24న LSG రాజస్థాన్ రాయల్స్‌తో తొలి మ్యాచ్ తో ఈ లీగ్ ను ప్రారంభించనుంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ ఇండోర్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.