ఇండియాలో లూబ్రిజోల్  భారీ ఇన్వెస్ట్​మెంట్

ఇండియాలో లూబ్రిజోల్  భారీ ఇన్వెస్ట్​మెంట్

న్యూఢిల్లీ/ముంబై: బెర్క్‌‌‌‌షైర్ హాత్‌‌‌‌వే అనుబంధ సంస్థ అయిన లూబ్రిజోల్ భారతదేశంలో 150 మిలియన్​ డాలర్లను (దాదాపు రూ.1,229 కోట్లు) పెట్టుబడి పెడుతుందని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రెబెక్కా లైబర్ట్ తెలిపారు.   భవిష్యత్తులో ఇండియాను తయారీ హబ్​గా మార్చుకుంటామని స్పెషాలిటీ కెమికల్స్​ తయారు చేసే ఈ కంపెనీ ప్రకటించింది.  తాము భారతదేశంలో ప్రస్తుతం స్థానిక అవసరాల కోసమే ప్రొడక్టులను తయారు చేస్తున్నామని, ఇక నుంచి ఎగుమతి మార్కెట్ కోసం  కూడా ఇక్కడే ఉత్పత్తి చేస్తామని వెల్లడించారు.  ఎలక్ట్రిక్ వెహికల్స్​, ఫ్యూచర్​ మొబిలిటీ, హెల్త్​ బ్యూటీ, హోమ్ ​స్పేస్ ​సెగ్మెంట్లపైనా పనిచేస్తామని లైబర్ట్ చెప్పారు. భారతీయ కార్యకలాపాలలో భాగంగా, లూబ్రిజోల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌‌‌‌తో కలిసి లూబ్రికెంట్ల కోసం కెమికల్​ యాడిటివ్స్​ను తయారు చేయడానికి జాయింట్ వెంచర్‌‌‌‌ను ఏర్పాటు చేసింది. ఇందులో  దీనికి మొదట్లో 50శాతం వాటా ఉండేది.

2017లో మరో 26శాతం కైవసం చేసుకుంది. 1966లో భారత్‌‌‌‌లోకి ప్రవేశించినప్పటి నుంచి దేశంలోనే లూబ్రిజోల్​కు ఇదే అతిపెద్ద పెట్టుబడి అవుతుందని ఆమె చెప్పారు. గుజరాత్‌‌‌‌లోని విలాయత్‌‌‌‌లో క్లోరినేటెడ్ పాలీ వినైల్ క్లోరైడ్ (సీపీవీసీ) రెసిన్ ప్లాంట్ నిర్మాణం ప్రారంభించడానికి ఈ 150 మిలియన్​ డాలర్ల పెట్టుబడిని ఉపయోగిస్తామని అన్నారు.  దహేజ్ యూనిట్ సామర్థ్యాన్ని కూడా రెట్టింపు చేస్తారు. నవీ ముంబైలో గ్రీజు లేబొరేటరీ తెరుస్తారు. లూబ్రిజోల్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈ ఏడాది చివర్లో విలాయత్‌‌‌‌లోని గ్రాసిమ్ సైట్‌‌‌‌లో లక్ష -మెట్రిక్-టన్నుల అత్యాధునిక సీపీవీసీ రెసిన్ ప్లాంట్  మొదటి దశను ప్రారంభిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా సీపీవీసీ రెసిన్ ఉత్పత్తికి ఇది అతిపెద్ద సింగిల్-సైట్ అవుతుంది. కంపెనీ దహేజ్‌‌‌‌ ప్లాంటు సీపీవీసీ సామర్థ్యాన్ని 140,000 మెట్రిక్​ టన్నులకు పెంచుతారు. లూబ్రిజోల్ ఆర్​ అండ్​ డీ సెంటర్​ను కూడా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. లూబ్రిజోల్ రూ.1,229 కోట్ల పెట్టుబడి పెడుతుండగా, దాని భారతీయ భాగస్వాములు ఈ సౌకర్యం కోసం భూమి,  ఇతర ఆస్తులను అందజేస్తారు.