IPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో.. ఫస్ట్ బ్యాటింగ్ చెన్నైదే

IPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో.. ఫస్ట్ బ్యాటింగ్ చెన్నైదే

లక్నో: ఐపీఎల్ 19లో భాగంగా శుక్రవారం (మే 15) చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచులో ఎల్ఎస్‎జీ కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో చెన్నై తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఇరు జట్లు స్వల్ప మార్పులతో బరిలోకి దిగుతున్నాయి. 

గాయం కారణంగా లీగ్‎లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని సీఎస్కే మాజీ సారథి ధోనీ లక్నోతో పోరుకు దూరమయ్యాడు. దీంతో తలా ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురి అవుతున్నారు. ఇదిలా ఉంటే,ఈ మ్యాచ్ సీఎస్కే్కు ఎంతో కీలకం. లీగ్‎లో ఇప్పటి వరకు 11 మ్యాచులు ఆడిన చెన్నై 6 విజయాలు, ఐదు ఓటములతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. 

ఈ మ్యాచులో గెలిస్తే చెన్నై ప్లే ఆఫ్స్ కు చేరుకోవడం మరింత సులభమవుతోంది. ఇక, లీగ్ లో 11 మ్యాచులు ఆడి కేవలం మూడు విజయాలు మాత్రమే సాధించిన పంత్ సేన ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. పంత్ సేనకు ఇది నామమాత్రపు మ్యాచే. గెలిచినా ఓడినా ఆ జట్టుకు పెద్దగా ఒరిగేదేమి లేదు.  

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

సంజు శాంసన్ (w), రుతురాజ్ గైక్వాడ్ (సి), ఉర్విల్ పటేల్, కార్తీక్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, ప్రశాంత్ వీర్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్, ముఖేష్ చౌదరి

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): 

మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఐడెన్ మార్క్రామ్, రిషబ్ పంత్(w/c), ముకుల్ చౌదరి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మహ్మద్ షమీ, మయాంక్ యాదవ్, ఆకాష్ మహరాజ్ సింగ్, ప్రిన్స్ యాదవ్