LSG vs PBKS: ఐపీఎల్ 2026 లీగ్ దశ చివరి పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జాయింట్స్ (LSG) నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోరు సాధించింది. పంజాబ్ కింగ్స్ (PBKS) బౌలర్లు ఆరంభంలో వికెట్లు తీసినప్పటికీ.. లక్నో మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఎకానా స్టేడియంలో బౌండరీల వర్షం కురిపించారు. పంజాబ్ ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఇప్పుడు 197 పరుగులు చేయాల్సి ఉంది.
20 పరుగులకే 2 వికెట్లు డౌన్.. షాకింగ్ స్టార్ట్!
మొదట బ్యాటింగ్ ప్రారంభించిన లక్నోకు పంజాబ్ బౌలర్లు పవర్‌ప్లేలోనే గట్టి షాక్‌లు ఇచ్చారు.16 పరుగుల వద్ద డెబ్యూ ఓపెనర్ అర్షిన్ కుల్కర్ణి (0)ని అజ్మతుల్లా ఒమర్జాయ్ గోల్డెన్ డకౌట్ చేశాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ (2) మరోసారి ఫెయిల్ అయ్యాడు. మార్కో జాన్సెన్ వేసిన అద్భుతమైన బంతికి పూరన్ క్లీన్ బౌల్డ్ అవ్వడంతో లక్నో 20 రన్స్‌కే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
బదోనీ విధ్వంసం:
కష్టాల్లో ఉన్న జట్టును ఆయుష్ బదోనీ తన మెరుపు బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. ముఖ్యంగా మార్కో జాన్సెన్ వేసిన పవర్‌ప్లే ఆఖరి ఓవర్లో 1, wd, 4, 6, 6, 2, 4 లతో ఏకంగా 24 పరుగులు పిండుకుని పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరును 66 పరుగులకు చేర్చాడు. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ(18 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్సులతో 43 పరుగులు)కి చేరువైన బదోనీని.. యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌లో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ చాకచక్యంగా స్టంపౌట్ చేసి పంజాబ్‌కు బ్రేక్‌త్రూ ఇచ్చాడు.
జోస్ ఇంగ్లిస్ క్లాస్ ఇన్నింగ్స్:
మరో ఎండ్‌లో ఓపెనర్‌గా వచ్చిన జోస్ ఇంగ్లిస్ పంజాబ్ బౌలర్లను వణికించాడు. మైదానం నలుమూలలా షాట్లు ఆడుతూ కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లక్నో స్కోరు 169 పరుగుల వద్ద ఉన్నప్పుడు.. శశాంక్ సింగ్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి ఇంగ్లిస్ ( 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులతో 72 పరుగులు) అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ముకుల్ చౌదరి విఫలమైనప్పటికీ.. చివర్లో వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ అబ్దుల్ సమద్ బౌండరీలతో విరుచుకుపడటంతో లక్నో 20 ఓవర్లలో 196 రన్స్ చేసింది. పంజాబ్ బౌలర్లలో చాహల్, ఒమర్జాయ్, జాన్సెన్, శశాంక్ సింగ్ వికెట్లు పడగొట్టారు.
Swinging the momentum #LSG's way 💪
— IndianPremierLeague (@IPL) May 23, 2026
🎥 Abdul Samad with a fiery flourish in the final over 💥
Scorecard ▶️ https://t.co/2ADKr4dqhi#TATAIPL | #KhelBindaas | #LSGvPBKS | @LucknowIPL pic.twitter.com/GRv7JXQXmu
