నిర్మల్ జిల్లా ఖానాపూర్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీకి లక్కీ లాటరీ నిర్వహించారు. 400 డబుల్ బెడ్ రూం ఇండ్లకు.. 706 మందిని అర్హులుగా ఎంపిక చేశారు. అయితే.. అర్హుల ఎంపికలో అధికారులు తప్పులు చేశారని ఎమ్మెల్యే రేఖానాయక్ ఆరోపించడం వివాదంగా మారింది. అధికారుల ఎంపిక జాబితాలో తప్పుడు ఉన్నాయని స్థానిక ఎమ్మెల్యేనే ఆరోపిస్తున్నారని.. అలాంటప్పుడు లాటరీ ఎలా నిర్వహిస్తారని లబ్దిదారులు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు అర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని ఎమ్మెల్యే రేఖానాయక్తో.. కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
