నస్పూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా నిరుద్యోగ యువత కోసం మినీ జాబ్ మేళా నిర్వహిస్తునట్లు ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. మంచిర్యాలలోని ప్రభుత్వ ఐటీఐ భవనంలోని మోడల్ కెరీర్ సెంటర్ లో ఈ నెల 20న ఉదయం 10.30గంటల నుంచి జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఐటీఎం స్కిల్స్ అకాడమీలో 100 పోస్టులకు డిగ్రీ/పీజీ అర్హతలు కలిగిన 25 సంవత్సరాలలోపు యువతకు అవకాశం ఉందని తెలిపారు. పూర్తి వివరాలకు 8096857078, 9705820030, 8333059029 నంబర్లను సంప్రదించాలన్నారు.
