- కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్/బెల్లంపల్లి/జైపూర్ (భీమారం), వెలుగు: నీట్-పరీక్ష పున:నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ బాయ్స్హైస్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని గురువారం పోలీస్ అంబర్ కిషోర్ ఝా, డీసీసీ ఎ.భాస్కర్, మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్‌తో కలిసి సందర్శించారు. జిల్లా కేంద్రంలో 1,204 మంది పరీక్షకు హాజరు కానున్నారని, అన్ని ఏర్పాటు చేశామన్నారు.
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
బెల్లంపల్లి పట్టణానికి తాగునీరు అందించే అమృత్ 2.0 పనులను కలెక్టర్ తనిఖీ చేశారు. మున్సిపల్ పరిధిలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించారు. రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కాసిపేటలోని కేజీబీవీని సందర్శించి కిచెన్, అదనప తరగతి గదుల నిర్మాణ పనులు, స్టోర్ రూమ్‌లను తనిఖీ చేశారు.
వన మహోత్సవాన్ని సక్సెస్ చేయాలి
వనమహోత్సవంలో భాగంగా భీమారంలోని అటవీ ప్రాంతంలో జిల్లా అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, డీసీపీ భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, డీఆర్ డీఓ కిషన్, డీఏఓ సురేఖతో కలిసి కలెక్టర్ మొక్కలు నాటారు.
