మందమర్రి మండలంలో పోచమ్మ తల్లికి బోనాలు

మందమర్రి మండలంలో పోచమ్మ తల్లికి బోనాలు

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్టలో పోచమ్మతల్లి బోనాల వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఊరుకొలుపు తిరుగువారం సందర్భంగా భూలక్ష్మి తల్లి ఆలయం నుంచి 216 బోనాలతో మహిళలు, గ్రామస్తులు పోచమ్మతల్లి ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించారు.

అమ్మవారికి నైవేద్యం పెట్టి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వర్షాలు సంవృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని మొక్కుకున్నారు. సర్పంచ్ మాసు శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.