కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి : ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు సంగేపు బొర్రన్న

కౌలు రైతులకు  గుర్తింపు కార్డులు ఇవ్వాలి : ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు సంగేపు బొర్రన్న

నేరడిగొండ, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కౌలు రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులు అందజేయాలని రైతు స్వరాజ్య వేదిక ఆదిలాబాద్​ జిల్లా అధ్యక్షుడు సంగేపు బొర్రన్న డిమాండ్ చేశారు. గురువారం నేరడిగొండ మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన కౌలు రైతులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెక్కలు ముక్కలు చేసుకొని తాము పండించిన పంటలను అమ్ముకునేందుకు సాంకేతిక, ప్రభుత్వ నిబంధనల వల్ల అమ్ములకోలేక అవస్థలు పడుతున్నారన్నారు.