జన్నారం/జన్నారం రూరల్, వెలుగు: నిరుపేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్ లో ఐలవేణి శ్రీనివాస్, సత్య దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ గృహ ప్రవేశం గురువారం నిర్వహించగా కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతిఒక్కరికి విడతల వారీగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. అనంతరం పుట్టిగూడలో రూ.20 లక్షలతో నిర్మంచనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు.
బోనాల వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
జన్నారం మండలంలోని కిష్టాపూర్, చర్లపల్లి గ్రామాల్లో నిర్వహించిన పోచమ్మ బోనాల వేడుకల్లో ఎమ్మెల్యే బొజ్జు పాల్గొని ఆలయంలో పూజలు చేశారు. అనంతరం కస్తూర్బా స్కూల్ అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆయా కార్యక్రమాల్లో జన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ సయ్యద్ ఫసిఉల్లా, పొనకల్ సర్పంచ్ జక్కు సుష్మ, కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ నందునాయక్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ సయ్యద్ ఇసాక్, సెక్రటరీ ముజాఫర్ అలీఖాన్, జన్నారం టౌన్ ప్రెసిడెంట్ మంద రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
