- ఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్‌శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 12 మున్సిపాలిటీలలో ఇంటిగ్రెటెడ్ వెజ్ అండ్ నాన్-వెజ్ మార్కెట్ల నిర్మాణానికి రూ. 22.93 కోట్లు విడుదల చేస్తూ మున్సిపల్ శాఖ కార్యదర్శి టి.కె. శ్రీదేవి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. భూపాలపల్లికి రూ.3.35 కోట్లు, నారాయణపేట, కోస్గి, మక్తల్‌కు కలిపి రూ.3.93 కోట్లు, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌కు కలిపి రూ.13.59 కోట్లు, హుజురాబాద్, చొప్పదండి, జమ్మికుంట, కొత్తపల్లికి రూ.1.99 కోట్లను కేటాయించారు. ఈ నిధులకు సంబంధించిన నిర్మాణ పనులు, ఖర్చుల వివరాలతో పాటు యుటిలైజేషన్ సర్టిఫికెట్లను (యూసీలు) సకాలంలో సంబంధిత అధికారులకు సమర్పించాలని పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ చీఫ్ ఇంజినీర్, సీడీఎంఏ కమిషనర్‌ను కార్యదర్శి శ్రీదేవి ఆదేశించారు
