ఇండియా మ్యాచ్కు లుంగి ఎంగిడి దూరం

ఇండియా మ్యాచ్కు లుంగి ఎంగిడి దూరం

సౌతాంప్టన్‌‌: వరుసగా రెండు మ్యాచ్‌‌ల్లో ఓడిపోయిన సౌతాఫ్రికాకు మరో ఎదురుదెబ్బ. ఇండియాతో బుధవారం జరిగే కీలక మ్యాచ్‌‌కు యువ పేసర్‌‌ లుంగి ఎంగిడి సేవలను సఫారీ టీమ్‌‌ కోల్పోనుంది.  బంగ్లాదేశ్‌‌తో మ్యాచ్‌‌ సందర్భంగా గాయపడ్డ లుంగి ఎంగిడి  దాదాపు వారం నుంచి పది రోజుల వరకూ ఆటకు దూరంగా ఉంటాడని టీమ్‌‌ డాక్టర్‌‌ మూసజీ తెలిపాడు. ఎడమ కాలు కండరాలు పట్టేయంతో ఎంగిడి ఇబ్బంది పడుతున్నాడన్నాడని చెప్పాడు.  వెటరన్‌‌ బౌలర్‌‌ డేల్‌‌ స్టెయిన్‌‌  ఫిట్‌‌నెస్‌‌ సాధిస్తే ఎంగిడి ప్లేస్‌‌లో జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే,  ప్రాక్టీస్‌‌ సెషన్‌‌లో స్టెయిన్ కొన్ని ఓవర్లు బౌలింగ్‌‌ చేశాడు. కాగా, తొలి మ్యాచ్‌‌లో జోఫ్రా ఆర్చర్‌‌ సంధించిన బౌన్సర్‌‌ హెల్మెట్‌‌కు తగలడంతో  ఇబ్బంది పడ్డ సీనియర్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌ హషీమ్‌‌ ఆమ్లా కోలుకోవడం సఫారీ టీమ్‌‌కు ఊరటనిచ్చే అంశం.