ఒడిశా రాజకీయాల్లో లుంగీ పంచాయతీ.. సీఎం లుంగీపై బీజేడీ, బీజేపీ మాటల యుద్ధం

ఒడిశా రాజకీయాల్లో లుంగీ పంచాయతీ..  సీఎం లుంగీపై బీజేడీ, బీజేపీ మాటల యుద్ధం

ఒడిశా రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలకు ఒకేసారి ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. బీజూ జనతాదళ్ అధినేత, సీఎం నవీన్ పట్నాయక్ ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన.. తన పార్టీ గుర్తు అయిన శంఖంను రెండు చేతులతో పట్టుకుని.. ఓ ఓటు ఎమ్మెల్యేకు.. మరో ఓటు ఎంపీకి వేయండి అని కోరుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో నవీన్ పట్నాయక్ లుంగీ ధరించి ఉన్నారు.. ఈ వీడియోపై బీజేపీ సెటైర్లు వేస్తుంది.. లుంగీ సీఎం.. లుంగీ సీఎం అంటూ చురకలు అంటించింది. .

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. నవీన్ బాబు అనే వృద్ధుడు రెండు శంఖాలతో ఓట్లు అడుక్కుంటున్నాడు.. వృద్ధుడు అయిన నవీన్ బాబుపై గౌరవం ఉంది కానీ.. కాకపోతే కుర్తా పైజమా వేసుకునే బాబు.. ఇలా లుంగీలో దర్శనం ఇవ్వటం చూసి అయినా.. ఆ పార్టీ నేతలు నేర్చుకోవాల్సి చాలా ఉంది అంటూ కామెంట్ చేశారు.. 

లుంగీ కట్టుకుని ఇబ్బంది ఏంటీ అని మిగతా రాష్ట్రాల వాళ్లకు చాలా డౌట్స్ రావొచ్చు.. ఒడిశాలో లుంగీతో బహిరంగంగా.. బయట తిరగరు అంట.. ఇంట్లో మాత్రమే లుంగీ కట్టుకుంటారంట.. లుంగీతో బజారుకు రావటం.. షాపులకు వెళ్లటం చేయరంట.. ఇంట్లో లుంగీ ధరించినా.. బయటకు కనిపించేటప్పుడు లేదా బయటకు రావాలి అనుకున్నప్పుడు కుర్తా పైజమా ధరిస్తారంట.. ఇది ఒడిశాలో కామన్ అంట.. అయితే తెలంగాణ, ఏపీలో మాత్రం లుంగీ అనేది కామన్.. రెగ్యులర్ గా లుంగీతో బయటకు కూడా వస్తుంటారు.. ఒడిశాలో అలా కాకపోవటంతో.. ఈ లుంగీ పంచాయితీ ఏంటా అని మిగతా రాష్ట్రాల వాళ్లకు ఆసక్తిగా మారింది. 

ఏకంగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్.. లుంగీ ధరించి.. ఎన్నికల గుర్తులతో వీడియో సందేశం ఇవ్వటం.. దాన్ని బీజేపీ టార్గెట్ చేయటం ఆసక్తిగా మారింది. వృద్ధుడు అయిన నవీన్ బాబు అంటూ లుంగీ ధరించిన ఫొటోలతో షేర్ చేస్తూ.. నవీన్ పట్నాయక్ వయస్సు అయిపోయింది.. పర్మినెంట్ గా లుంగీ కట్టుకుని.. ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటే బెటర్ అంటున్నారు బీజేపీ నేతలు..

లుంగీ కట్టుకుంటే తప్పేంటని బీజేడీ ఎదురుదాడి చేస్తుంది. బీజేపీకి కౌంటర్ గా బీజేడీ నేతలు కొందరు లుంగీలు కట్టుకుని ఫొటోలు రిలీజ్ చేస్తు్న్నారు. మీ ఇంట్లో మీరు లుంగీలు కట్టుకోరా అంటూ బీజేపీకి కౌంటర్ చేస్తుంది బీజూ జనతాదళ్ పార్టీ..