దళ కమాండర్ అరెస్ట్

దళ కమాండర్ అరెస్ట్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మావోయిస్ట్​ పార్టీకి చెందిన పామేడు ఎల్వోఎస్​ దళ కమాండర్​ గొట్టా బుజ్జి అలియాస్​ కమల అలియాస్​లక్ష్మిని అరెస్టు చేసినట్టు భద్రాద్దరి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్​ వినీత్​ తెలిపారు. వివరాలను ఆయన శుక్రవారం వెల్లడించారు. చర్ల మండలంలోని తాలిపేరు డ్యాం వద్ద వెహికిల్స్​చెక్​ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన బుజ్జిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, విచారించగా ఆమె మావోయిస్టు పార్టీ పామేడ దళ కమాండర్ ​అని తేలిందన్నారు. చత్తీస్​గఢ్ ​రాష్ట్రంలోని బీజాపూర్​జిల్లా చర్పల్లికి చెందిన బుజ్జి 15 ఏండ్లుగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నారన్నారు. ఆమె నుంచి 3 కిలోల కెపాసిటీ ఉన్న స్టీల్​క్యాన్​, జిలిటెన్​ స్టిక్స్, 5, ఎలక్ట్రిక్​ డిటోనేటర్లు, 2 సిరంజీలు , 4 బ్యాటరీలు , 80 మీటర్ల కార్డెక్స్, ఎలక్ట్రిక్​ వైరు స్వాధీనం చేసుకున్నామన్నారు. చర్ల, దుమ్ముగూడెం, కిష్టారం పోలీస్​స్టేషన్ల పరిధిలో జరిగిన పలు విధ్వంస ఘటనల్లో బుజ్జి కీలక పాత్ర వహించిందన్నారు. చర్ల పోలీస్​స్టేషన్​లో 10, దుమ్ముగూడెం పీఎస్​లో 1, పామేడ్​పరిధిలో  6, కిష్టారంలో 9, ఉసూర్​, చింతగుప్ప పోలీస్​ స్టేషన్లలో మొత్తం 30 కేసులు  ఉన్నాయన్నారు.