డియార్ మూవీ నుంచి .. భలే వెడ్డింగ్.. సూపర్ సెట్టింగ్ .. లీరికల్ సాంగ్ రిలీజ్

డియార్ మూవీ నుంచి .. భలే వెడ్డింగ్.. సూపర్ సెట్టింగ్ .. లీరికల్ సాంగ్ రిలీజ్

జీవీ ప్రకాష్ కుమార్,  ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘డియర్’.  ఆనంద్ రవిచంద్రన్ దర్శకుడు. వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి పృథ్వీరాజ్ నిర్మించారు.  తాజాగా  ఈ చిత్రం నుంచి ‘భలే వెడ్డింగ్.. సూపర్ సెట్టింగ్’ అంటూ సాగే  పాటని విడుదల చేశారు. హీరోగా నటిస్తూనే ఈ చిత్రానికి మ్యూజిక్ కూడా అందించాడు జీవీ ప్రకాష్. తను కంపోజ్ చేసిన ఈ మెలోడీ సాంగ్ ఆకట్టుకుంది.

రాకేందు మౌళి లిరిక్స్ రాయగా,  నారాయణన్ రవిశంకర్, సింధూరి విశాల్  గ్రేస్ ఫుల్‌‌‌‌గా పాడిన తీరు ఇంప్రెస్ చేస్తుంది.  ఈ పాటలో జీవీ ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ పెళ్లి వేడుకలో సందడి చేస్తూ కనిపించారు. వీరిద్దరి మధ్య  కెమిస్ట్రీ బ్యూటిఫుల్‌‌‌‌గా ఉంది.  తమిళంలో  ఏప్రిల్ 11న ఈ సినిమా విడుదలవుతుండగా, ఒక రోజు గ్యాప్‌‌‌‌తో ఏప్రిల్ 12న తెలుగు వెర్షన్ రిలీజ్ అవుతోంది. ఈ మూవీ ఆంధ్ర రైట్స్‌‌‌‌ను అన్నపూర్ణ స్టూడియోస్, తెలంగాణ రైట్స్‌‌‌‌ను ఏషియన్ సినిమాస్ సంస్థలు కొనుగోలు చేశాయి.