
విజయవాడ: విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలతోనే జగన్ పతనం మొదలవుతుందని అన్నారు టీడీపీ నేత, ఎంపీ కేశినేని నాని. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడలో 75 శాతం సీట్లు టీడీపీ గెలవబోతుందన్నారు. ఈ ఎన్నికల్లో సీపీఐ టీడీపీ కలిసి పోటీ చేస్తుందని, కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్, విజయవాడ కార్పొరేషన్ గెలుస్తున్నామన్నారు.
నిజంగా ప్రజలంతా జగన్ పక్షాన ఉండుంటే స్వేచ్ఛగా ఎన్నికలు జరపాలని సవాల్ విసిరారు కేశినేని నాని. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేషన్ లలో టీడీపీ గెలుస్తుందని, వైసీపీ ఓటమి ఖాయమని అన్నారు. ఓటమి భయంతో జగన్ తమ అభ్యర్థులపై కేసులు పెట్టిస్తున్నారన్నారు
సీఎం గా జగన్ ఫెయిల్ అయ్యారని, కృష్ణా, గుంటూరు జిల్లాలు నాశనం అవ్వాలని జగన్ ఎందుకు కోరుకుంటున్నాడని నాని ప్రశ్నించారు. కేసులకు భయపడి.. బీజేపీ కి అమ్ముడు పోయాడని, 22 మంది ఎంపీలతో సీఏఏ కి అనుకూలంగా ఓటు వేయించాడని అన్నారు. కేంద్రం మెడలు వంచుతానని..కేంద్ర ప్రభుత్వం కాళ్ళు పట్టుకున్నాడన్నారు. రాష్ట్రాన్ని బీజేపీ కి తాకట్టు పెట్టారని ఆరోపించారు.