అల‌రించిన నాట్యతోర‌ణం.. మాదాపూర్ శిల్పకళా వేదికలో అలరించిన నాట్యకారులు

అల‌రించిన నాట్యతోర‌ణం.. మాదాపూర్ శిల్పకళా వేదికలో అలరించిన నాట్యకారులు

అమృత్ కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాట్య తోరణం నృత్యపండుగ ఆదివారం మాదాపూర్ శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. భరతనాట్యం, కూచిపూడి, కథక్, మోహినీఅట్టం, ఒడిస్సీ, జుగల్​బందీ రీతులతో 40 మందికి పైగా నాట్యకారులు 2.5 గంటలపాటు అద్భుత ప్రదర్శన ఇచ్చారు. ముఖ్య అతిథులుగా సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, రిటైర్డ్ ఐఏఎస్ టి. చంద్రశేఖర్, అదనపు డీజీపీ అనిల్ కుమార్ హాజరయ్యారు.