వావ్.. బెంగళూరులో సెల్ఫ్ డ్రైవింగ్ కార్.. డ్రైవర్ లేకుండానే ఎలా వెళ్తుందో చూడండి..

వావ్.. బెంగళూరులో సెల్ఫ్ డ్రైవింగ్ కార్.. డ్రైవర్ లేకుండానే ఎలా వెళ్తుందో చూడండి..

ప్రముఖ ఐటి కంపెనీ  విప్రో, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), ఆర్‌వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (RVCE)  కలిసి అభివృద్ధి చేసిన డ్రైవర్‌లెస్ కారును బెంగళూరులో ప్రదర్శించారు. ఈ ప్రాజెక్టు పేరు WIRIN (విప్రో-IISc రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ నెట్‌వర్క్).

ఈ సందర్భంగా ఉత్తరాది మఠానికి చెందిన శ్రీ శ్రీ 1008 సత్యాత్మ తీర్థ శ్రీపాదాంగాలు డ్రైవర్‌లెస్ కారులో కూర్చున్న 28 సెకన్ల వీడియో ఒకటి X (ట్విట్టర్)లో వైరల్ అయింది. ఈ వీడియోలో స్వామీజీ సెల్ఫ్ డ్రైవింగ్ కారులో కూర్చుని ఉండగా, దేశీయ సాంకేతికతతో నడిచే ఈ  కారు కాలేజీలో తిరుగుతూ కనిపించింది.

సమాచారం ప్రకారం, ఈ డ్రైవర్‌లెస్ కారు ప్రోటోటైప్ అక్టోబర్ 27న ఆర్‌వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి విప్రోలో అటానమస్ సిస్టమ్స్ అండ్ రోబోటిక్స్ గ్లోబల్ హెడ్ రామచంద్ర బుధిహాల్, రాష్ట్రీయ శిక్ష సమితి ట్రస్ట్ (RSST) అధ్యక్షుడు MP శ్యామ్,   RVCE ప్రిన్సిపాల్ KN సుబ్రమణ్య నాయకత్వం వహించారు.

ఈ దేశీయ సెల్ఫ్-డ్రైవింగ్ కారును ఆర్వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌కు చెందిన అధ్యాపకులు, విద్యార్థుల బృందం ఆరు సంవత్సరాలుగా తయారుచేసింది.  2019లో IISc & Wipro కలిసి భారతీయ రోడ్లకు (గుంతలు, పశువుల క్రాసింగ్‌లు ఉండే) అనుకూలమైన డ్రైవర్‌లెస్ కారును అభివృద్ధి చేశాయి.

అటానమస్ సిస్టమ్స్, రోబోటిక్స్, 5Gలో పరిశోధనల కోసం విప్రో, IIScతో కలిసి Wipro IISc రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ నెట్‌వర్క్ (WIRIN)ను ఏర్పాటు చేసింది. ఈ బృందం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్, విజువల్ కంప్యూటింగ్, HCI, V2X (వెహికల్-టు-ఎవ్రీథింగ్) కమ్యూనికేషన్ వంటి అంశాలపై దృష్టి సారిస్తుంది.