మధు శాలిని ‘కన్యా కుమారి’ సినిమా ఆగస్టు 27న విడుదల

మధు శాలిని ‘కన్యా కుమారి’ సినిమా ఆగస్టు 27న విడుదల

గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ జంటగా సృజన్ అట్టాడ దర్శక నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘కన్యా కుమారి’. నటి మధు శాలిని ప్రెజెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించిన ఈ సినిమా ఆగస్టు 27న విడుదల కానుంది.  నిర్మాత బన్నీ వాసు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బన్నీ వాసు మాట్లాడుతూ ‘ఇది చాలా హానెస్ట్ సినిమా. రియాల్టీని, కమర్షియాలిటీని బ్యాలెన్స్ చేస్తూ సృజన్ తీసిన తీరు నాకు నచ్చింది. పంట పొలాలతో ఒక ప్రేమ కథని ముడి పెడుతూ చెప్పడం బ్యూటిఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది.

గీత్ సైని, శ్రీచరణ్  చాలా క్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కనిపించారు. ఈ మధ్యకాలంలో నేను చూసిన బెస్ట్ పెయిర్ ఇది.  ఈ కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నచ్చే సినిమా రిలీజ్ చేయడానికి ముందుకొచ్చా. మధు షాలిని సినిమాల ద్వారా డబ్బు సంపాదించి సినిమాల్లోనే ఇన్వెస్ట్ చేయడం గొప్ప విషయం’ అని చెప్పారు.  ఫ్రెష్​ కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో వస్తోన్న ఈ చిత్రానికి బన్నీ వాసు గారు చేసిన సపోర్ట్ మర్చిపోలేనిది అని మధు షాలిని, సృజన్ అన్నారు. ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాతో పరిచయమవడం ఆనందంగా ఉందని నటీనటులు అన్నారు.