పార్లమెంట్ లోనూ సత్తా చాటుతాం : మధుయాష్కి

పార్లమెంట్ లోనూ సత్తా చాటుతాం : మధుయాష్కి

జగిత్యాల : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే రేపటి పార్లమెంట్ లో రిపీట్ అవుతాయన్నారు కాంగ్రెస్ నేత మధుయాష్కి. గురువారం జగిత్యాల జిల్లాలో  మాట్లాడిన ఆయన..పసుపు బోర్డు ఏర్పాటు, నిజం దక్కన్  షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడం లాంటి హామీలతో అదికారంలోకి వచ్చిన ఎంపీ కవిత.. తన హామీలను నెరవేర్చకుండానే మళ్ళి ఓట్లెలా అడుగుతారని ప్రశ్నించారు.  కోట్లాది రూపాయల ఖర్చు, ఈవియంల మానిప్లేట్ చేసి గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో  ఎదురు దెబ్బ తప్పదన్నారు.

పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు.. పసుపుకు 10,000/ -, ఎర్రజొన్నకు 2500/- , వరికి 2500/- మద్దతు ధర కల్పిస్తామని తెలిపారు మధుయాష్కి.  ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న TRS ప్రభుత్వం ,ప్రాజెక్టుల జాతీయ హోదాకోసం ప్రయత్నించలేదన్నారు. సారు, కారు, డిల్లీలో కాదు TRS పరిస్తితి డిల్లీలో బేకారు అవుతుందన్నారు. సీఎం కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా జీవన్ రెడ్డి విజయం నిదర్శనంగా నిలుస్తుందన్నారు మధుయాష్కి.