
కూకట్పల్లి, వెలుగు: చట్నీలో బొద్దింకలు, కిచెన్‌లో అపరిశుభ్ర వాతావరణం ఉండటంతో కూకట్‌పల్లిలోని మధురం రెస్టారెంట్‌ని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. చట్నీలో బొద్దింకలు వచ్చాయని ఒక కస్టమర్ కూకట్పల్లి జోన్ జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు అధికారులు రెస్టారెంట్లో తనిఖీలు నిర్వహించగా కిచెన్‌లో ఎక్కడ చూసినా బొద్దింకలు కనిపించాయి. హోటల్ అపరిశుభ్రంగా ఉంది. దీంతో రెస్టారెంట్‌ను సీజ్ చేశారు.