- రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి
- హైతాబాద్‌లో బుగ్గ రెడ్డి క్లినిక్ ప్రారంభం
షాద్‌నగర్, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందాల్సిన అవసరం ఎంతైనా ఉందని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి అన్నారు. సోమవారం షాబాద్ మండలంలోని హైతాబాద్‌లో డాక్టర్ అనురాగ్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బుగ్గ రెడ్డి క్లినిక్‌ను ఆయన ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి, చేవెళ్ల కాంగ్రెస్ ఇన్చార్జి భీమ్ భారత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. చిన్న చిన్న ఆరోగ్య సమస్యల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే పనిలేకుండా స్థానికంగానే క్లినిక్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
