ప్రియాంక గాంధీపై కేసు.. నిరాధార ఆరోపణలు చేశారని బీజేపీ నేతల కంప్లెంట్​

ప్రియాంక గాంధీపై కేసు.. నిరాధార ఆరోపణలు చేశారని బీజేపీ నేతల కంప్లెంట్​

మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేసి ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయాలని చూశారన్న ఆ పార్టీ నేతల ఫిర్యాదుతో కాంగ్రెస్​ సీనియర్​ నేత ప్రియాంక గాంధీ, ఎంపీ కమల్​నాథ్, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ యాదవ్​లపై కేసులు నమోదయ్యాయి. 

అవినీతి అరోపణలపై ఫేక్​ లెటర్​ని సోషల్ మీడియాలో జ్ఞానేంద్ర అవస్తి పేరుతో ప్రచారం చేస్తున్నారని బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్‌ నిమేశ్ పతాక్‌ చేసిన కంప్లెంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్ల నుంచి 50 శాతం కమీషన్‌ను ప్రభుత్వం వసూలు చేస్తోందని ప్రియాంక ఆరోపించారు. 

కర్ణాటక ఎన్నికల్లో 40 శాతం కమిషన్​ సర్కార్​ను ప్రజలు ఓడించినట్లు మధ్యప్రదేశ్​లోని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడిస్తారని ఆమె అన్నారు.  కమీషన్ ఇవ్వనిదే బిల్లులు ముందుకు వెళ్లడం లేదని కాంట్రాక్టర్లు హైకోర్టు సీజేకి లేఖ రాశారంటూ ఆరోపించారు. 

కాంగ్రెస్ నేతలు కమల్ నాథ్‌లు, అరుణ్‌ యాదవ్‌లతో పాటు ఆమె కూడా ఇదే అంశాన్ని ట్యాగ్​చేస్తూ ట్విటర్‌‌లో పోస్టు చేశారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఆరోపణల తాలూకు ఆధారాలు చూపించాలని హోం మంత్రి నరోత్తమ్​ మిశ్రా డిమాండ్​ చేశారు.