జననాయగన్ కు క్లియరెన్స్.. అంతలోనే స్టే..మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ స్టే

జననాయగన్ కు క్లియరెన్స్.. అంతలోనే స్టే..మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ స్టే

చెన్నై: తమిళ నటుడు, టీవీకే చీఫ్ విజయ్ నటించిన జన నాయగన్ సినిమాకు మళ్లీ బ్రేక్ పడింది. ఈ సినిమాకు వెంటనే యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేయాలంటూ సెన్సార్ బోర్డును శుక్ర వారం మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఆదేశించిన కొన్ని గంటలకే.. డివిజన్ బెంచ్ మళ్లీ స్టే విధిస్తూ షాక్ ఇచ్చింది. ముందుగా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులతో సినిమా విడుదలకు ఆటంకం తొలగినట్టవడంతో విజయ్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. 

కానీ, సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్​సీ) వెంటనే మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్​ను ఆశ్రయించించగా.. కేసును విచారణకు స్వీకరించిన బెంచ్.. సెన్సార్ సర్టిఫికెట్ జారీపై స్టే విధించింది.