డివోషనల్ టచ్‌‌తో ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’

డివోషనల్ టచ్‌‌తో ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’

తల్లాడ సాయికృష్ణ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’. మీరు అనుకున్నది కాదు అనేది ట్యాగ్ లైన్. ఏకదంతాయ సిరి హీరోయిన్. దర్శకుడు కె.దశరథ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉంది.  తాజాగా  ఈ మూవీ టైటిల్ లాంచ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు. హీరో, దర్శకుడు తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ ‘సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌‌తో పాటు డివోషనల్ టచ్‌‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం.

డైరెక్టర్ దశరథ్ గారి సపోర్ట్ మర్చిపోలేనిది. సాయిబాబాతోపాటు ఆయన బ్లెస్సింగ్స్‌‌తోనే ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో తమ సహకారం అందించారు’ అని చెప్పాడు.  తన పాత్రకు మంచి గుర్తింపు వస్తుందని హీరోయిన్ చెప్పింది. డైరెక్టర్ దశరథ్ మాట్లాడుతూ ‘సాయికృష్ణకు సినిమా అంటే ప్యాషన్. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది.  అందరికీ నచ్చేలా ఉంటుంది’ అని అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.