‘గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ఆటో..‘కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’జర్నీ

‘గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ఆటో..‘కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’జర్నీ

మండే ఎండల్లో ఆటో ఎక్కే ప్రయాణికులను వేడి నుంచి రక్షించేందుకు ఓ డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వినూత్నంగా ఆలోచించాడు. మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా ఈదులపూసలపల్లికి చెందిన భుక్యా హంజ్యా (ఆటో అంజి) తన ఆటో చుట్టూ గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పైన వివిధ రకాల మొక్కలు ఏర్పాటు చేశాడు. 

అంతేకాకుండా ఆటో లోపల రెండు చిన్న ఫ్యాన్లు అమర్చడంతో పాటు ప్రయాణికుల కోసం కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సౌకర్యాన్ని సైతం కల్పించాడు. అలాగే దివ్యాంగులు, గర్భిణులకు తన ఆటోలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాడు. దీంతో ఆటో అంజిని పలువురు అభినందిస్తున్నారు.
- మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు