అయ్యప్ప స్వామి మాలలో ఉండి.. ప్రత్యర్థులపై శంకర్ నాయక్ అసభ్య పదజాలం

అయ్యప్ప స్వామి మాలలో ఉండి.. ప్రత్యర్థులపై శంకర్ నాయక్ అసభ్య పదజాలం

మహబూబాబాద్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ హాట్ కామెంట్స్ చేశారు. పార్టీలో ఉండి తనను ఎవరు ఎలా మోసం చేశారో చూపిస్తానంటూ సవాల్ విసిరారు. ఇప్పటికే తాను 55 సంవత్సరాలకు పైగా ఉన్నానని, ఇంకా తనను ఏం చేస్తారంటూ మాట్లాడారు. ఇక ఒక్కోక్కడిని ఆట ఆడుకుంటా... వేట మొదలైంది అని అన్నారు. భవిష్యత్తు ఎలా ప్లాన్ చేయాలని మాజీ సీఎం కేసీఆర్ యశోద హాస్పిటల్ లో ఉండి బుక్స్ చదువుతున్నారని అన్నారు. 

తాను (శంకర్ నాయక్), కేసీఆర్ ఒక్క కార్తెలోనే పుట్టాం బిడ్డ అంటూ కామెంట్స్ చేశారు. కార్యకర్తలను కాపాడుకునే సత్తా తనకు పుష్కలంగా ఉందన్నారు. రాత్రి 12 గంటలకు ఆపద వచ్చిన ఫోన్ చేయండి వస్తా అని కార్యకర్తలకు సూచించారు. అయ్యప్ప స్వామి మాలలో ఉన్న శంకర్ నాయక్ ప్రత్యర్థులపై అసభ్య పదజాలంతో దూషించారు. 

శంకర్ నాయక్ ఏమన్నారంటే..? 

‘‘నీకు ధైర్యం ఉంటే నా కార్యకర్తను ముట్టుకో.. తర్వాత ఏమైతదో చూసుకో... ఇన్నిరోజులు ఎమ్మెల్యే పదవి ఉంది కాబట్టే అలోచించాను. ఇప్పుడు మనల్ని ఆపేటోడు లేడు.. నేను చేసిన తప్పులను నిరూపించాలి.. నాపై ఆరోపణలు చేసిన వారికి సవాల్ చేశాను. కానీ.. ఎవ్వడు రాలే.. మనం ఎవ్వరి జోలికి పోవొద్దు.. మన జోలికి వస్తే వదిలిపెట్టొద్దు.. కార్యకర్తకు ఆపద వస్తే మెరుపు వేగంతో వస్తా.. మీకు అండగా నిలబడుతా’’ అంటూ కామెంట్స్ చేశారు. శంకర్ నాయక్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.