అడిషనల్‌‌ స్టాఫ్‌‌ను అందుబాటులో ఉంచాలి : కలెక్టర్‌‌ శశాంక

అడిషనల్‌‌ స్టాఫ్‌‌ను అందుబాటులో ఉంచాలి : కలెక్టర్‌‌ శశాంక
  •     మహబూబాబాద్‌‌ కలెక్టర్‌‌ శశాంక
  •     ఈవీఎంల ర్యాండమైజేషన్‌‌ పూర్తి చేసిన ఆఫీసర్లు

మహబూబాబాద్‌‌, వెలుగు : అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు అడిషనల్‌‌ సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని మహబూబాబాద్‌‌ కలెక్టర్‌‌ శశాంక ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌‌లో నిర్వహించిన రివ్యూలో ఆయన మాట్లాడారు. ఎలక్షన్‌‌ స్టాఫ్‌‌కు డ్యూటీలు కేటాయించాలని, ప్రిసైడింగ్‌‌ ఆఫీసర్స్‌‌, అసిస్టెంట్‌‌ ప్రిసైడింగ్‌‌ ఆఫీసర్లకు మాస్టర్‌‌ ట్రైనర్స్‌‌తో ట్రైనింగ్‌‌ క్లాస్‌‌లు నిర్వహించాలని సూచించారు. రివ్యూలో నోడల్‌‌ ఆఫీసర్‌‌ సుబ్బారావు, ఎలక్షన్‌‌ సూపరింటెండెంట్‌‌ పవన్‌‌,

ఈడీఎం ప్రశాంత్, తహసీల్దార్‌‌ భగవాన్‌‌రెడ్డి, డీటీ గణేశ్‌‌ పాల్గొన్నారు. అంతకుముందు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలు, వీవీ ప్యాట్ల ర్యాండమైజేషన్‌‌ పూర్తి చేశారు. మహబూబాబాద్, డోర్నకల్‌‌ నియోజకవర్గాలకు పోలింగ్ కేంద్రాల సంఖ్య ఆధారంగా ఈవీఎంలు, వీవీ ప్యాట్స్‌‌ కేటాయించినట్లు చెప్పారు. 

ఈవీఎంల ర్యాండమైజేషన్‌‌ పూర్తి

జనగామ అర్బన్‌‌, వెలుగు : అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం ర్యాండమైజేషన్‌‌ పూర్తి చేసినట్లు జనగామ ఎలక్షన్‌‌ ఆఫీసర్, కలెక్టర్‌‌ సీహెచ్‌‌.శివలింగయ్య చెప్పారు. శుక్రవారం స్థానికంగా ఆయన మాట్లాడుతూ బ్యాలెట్‌‌, కంట్రోల్‌‌ యూనిట్లు, వీవీ ప్యాట్స్‌‌ కేటాయింపు ఆన్‌‌లైన్‌‌ విధానం ద్వారా పూర్తయిందన్నారు. జనగామ జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎం, వీవీ ప్యాట్స్‌‌, బ్యాలెట్‌‌, కంట్రోల్‌‌ యూనిట్లను శనివారం ఉదయం నియోజకవర్గాల పరిధిలోని స్ట్రాంగ్‌‌ రూమ్‌‌లకు తరలిస్తామని చెప్పారు.

ఎలక్షన్లకు సంబంధించి ఏవైనా సమస్యలు, ఫిర్యాదులు ఉంటే 1950 టోల్‌‌ ఫ్రీ నంబర్‌‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో రిటర్నింగ్‌‌ ఆఫీసర్లు రోహిత్‌‌ సింగ్‌‌, మురళీకృష్ణ, రామ్మూర్తి, అసిస్టెంట్‌‌ ఎలక్షన్‌‌ ఆఫీసర్‌‌ సుహాసిని, కలెక్టరేట్‌‌ ఏవో రవీందర్, తహసీల్దార్‌‌ శ్రీనివాస్‌‌, వివిధ పార్టీల నాయకులు రవి, రాజశేఖర్, జోగు ప్రకాశ్‌‌, రావెల రవి, శ్రీధర్, జె.కుమార్, పాల్గొన్నారు.