అధికారుల పని తీరుపై ఎమ్మెల్యే మురళీ నాయక్ సీరియస్ అయ్యారు. ఇంట్లో కూర్చొని అధికారులు పని చేయొద్దని సూచించారు. మహబూబాబాద్ మున్సిపల్ కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్. ఈ సందర్బంగా పట్టణంలో కరెంటు సమస్య పట్ల ట్రాన్స్ కో అధికారులు నిర్లక్ష్యం తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిర్లక్ష్యం విడకపోతే..ఊరుకోనని హెచ్చరించారు. అర్ధరాత్రి కూడా కరెంటు విషయంలో తనకు ఫోన్ లు వస్తున్నాయన్నారు. అధికారులు ఎవరు కూడా ప్రభుత్వాన్ని బద్నాం చేయొద్దని హెచ్చరించారు. ఇది పేదల ప్రభుత్వమని అన్నారు. ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు. నియోజకవర్గంలో 3 వేల 500 ఇల్లు వస్తాయన్నారు.
ALSO READ | మూసీ మురికి నల్గొండ ప్రజలకు శాపం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి