- పాల్గొన్న ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్
హైదరాబాద్, వెలుగు: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం గాంధీ భవన్లో పలువురు కాంగ్రెస్ నేతలు ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, సీనియర్ కాంగ్రెస్ నేత కుమార్ రావుతో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.
ప్రధానిగా ఇందిరా గాంధీ దేశానికి చేసిన సేవలను నేతలు స్మరించుకున్నారు. తెలంగాణకు ఏఐసీసీ కార్యదర్శిగా నియమితులైన అనంతరం మొదటిసారి గాంధీ భవన్ కు వచ్చిన సచిన్ సావంత్‌కు పలువురు పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికి, ఆయన్ను సన్మానించారు.
