
మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో పని చేసే ప్రతి కార్యకర్త మనస్సు పెట్టి పని చెయ్యాలన్నారు. మనస్సులో ఒకటి పెట్టుకొని బయట ఇంకొకటి చేస్తే ఊరుకునేది లేదన్నారు. పార్టీలో ఉన్నవారు సక్రమంగా పని చేయాలని.. లేదంటే వెళ్లిపోవాలని సూచించారు. కార్యకర్తలు,నాయకులు కరెక్టగా పని చేయాలని తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేవేళన కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ కార్యకర్తలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లో పని చేసే ప్రతి కార్యకర్త మనస్సు పెట్టి పని చెయ్యాలన్నారు. అంతేగానీ ఎలక్షన్ సమయంలో మమ్మల్ని ఇబ్బందులు పెట్టవద్దని చెప్పారు.