మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: మహబూబ్ నగర్ జిల్లాలోని వివిధ స్కూళ్ల విద్యార్థులు రాసిన కథల సంకలనం ‘మహబూబ్‌నగర్ బడి పిల్లల కథలు’ పుస్తకాన్ని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఇ.నవీన్ నికోలస్ ఆవిష్కరించారు. సోమవారం హైదరాబాద్ ఎంసీహెచ్‌ఆర్‌డీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా విద్యార్థులు చక్కటి కథలు రాయడం అభినందనీయమన్నారు.
విద్యార్థుల్లో అభ్యసనాభివృద్ధికి, పఠనాసక్తిని పెంపొందించడానికి ఈ కథలు ఎంతగానో ఉపయోగపడుతాయని కొనియాడారు. ఈ కథలను తీసుకురావడానికి కృషి చేసిన జిల్లా విద్యాశాఖ బృందాన్ని ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ రమేశ్, ఆర్జేడీ సోమిరెడ్డి, ఎ.ఎం.ఓ దుంకుడు శ్రీనివాస్, జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ ప్రశాంత్ పాల్గొన్నారు.
