
పద్మారావునగర్, వెలుగు: మహంకాళి పోలీస్ స్టేషన్ లో బుధవారం స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్, డాక్టర్మోహన్ డయాబెటిస్ స్పెషాలిటీస్ సెంటర్ సౌజన్యంతో పోలీసులకు కంటి, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. అవసరమైన మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఏసీపీ సైదయ్య మాట్లాడుతూ.. పోలీస్‌సిబ్బంది విధి నిర్వహణలో బిజీగా ఉంటూ తమ ఆరోగ్యంపై అశ్రద్ధ వహిస్తారని తెలిపారు. ఇలాంటి మెడికల్ క్యాంప్‌లు వారికి ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. వైద్య శిబిరం నిర్వహించడానికి చొరవ చూపిన సీఐ పరశురామ్‌ను ఆయన అభినందించారు. కార్యక్రమంలో డీఐ రంగారెడ్డి, ఎస్సైలు సందీప్ రెడ్డి, శ్రీధర్, ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.