
మహారాష్ట్రలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయ్ గఢ్ జిల్లాలోని రెపోలి ప్రాంతం వద్ద గోవా -ముంబై హైవేపై వెళ్తున్న కారు లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా 9 మంది మృతి చెందారు. మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో 5 మంది మగవారు, ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. ఘటనా స్థలంలో కారు నుజ్జనుజ్జ అయ్యింది.
ఘటనా స్థలానికి చేరుకున్న రాయ్ గఢ్ పోలీసులు గాయపడిన చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. ముంబైకి వెళ్తున్న లారీని.. రత్నగిరి జిల్లాలోని గుహగర్‌కు వెళ్తున్న కారు ఢీ కొట్టిందని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.