
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో వసాయ్ స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. అక్టోబర్ 27 న సాయంత్రం కొన్ని కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం .. ప్రాణనష్టం కానీ జరగలేదని తెలుస్తోంది. స్థానిక అధికారులు, రైల్వే సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పట్టాలు తప్పడానికి కారణమేంటో తెలియాల్సి ఉంది.
గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో కాసేపు పన్వేల్- వసాయ్ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.
Maharashtra: A few coaches of a goods train derailed near Vasai station in Palghar district. No casualty or injury reported.
— ANI (@ANI) October 27, 2023
More details awaited