బ్రిడ్జిపై నుంచి పడిపోయిన బీజేపీ ఎమ్మెల్యే కారు

బ్రిడ్జిపై నుంచి పడిపోయిన బీజేపీ ఎమ్మెల్యే కారు

మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే జయకుమార్ గోరే కారు ప్రమాదానికి గురైంది. ఇవాళ తెల్లవారుజామున తన స్వస్థలమైన సతారా జిల్లాలోని ఫాల్తాన్ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు బ్రిడ్జి పై నుంచి 30 అడుగుల లోతుకు పడిపోయింది. దీంతో జయకుమార్ తో పాటు.. డ్రైవర్ సహా వాహనంలో ఉన్న మరో ముగ్గురు గాయపడ్డారు.

కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. జయకుమార్  గోరేను పూణెలోని రూబీ హాల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వ్యక్తుల్ని వేరువేరు ఆస్పత్రులకు తరలించారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గోరే సతారా జిల్లాలోని మాన్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.