షిండే సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ డాక్యుమెంట్లపై తల్లి పేరు తప్పనిసరి

షిండే సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ డాక్యుమెంట్లపై తల్లి పేరు తప్పనిసరి

మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనన ధృవీకరణ పత్రాలు, పాఠశాల రికార్డులు, ఆస్తి పత్రాలు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులతో సహా అన్ని ప్రభుత్వ పత్రాలపై తల్లి పేరు తప్పనిసరిగా చేర్చాలని షిండే మంత్రివర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ నిర్ణయం మే 1, 2024 నుండి అమలులోకి రానుంది. 

అంతకుముందు సోమవారం(మార్చి 11) ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత షిండే సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. విద్యా ధృవీకరణ పత్రాలు, డిగ్రీలు మరియు ఇతర పత్రాలలో తండ్రి పేర్లను మాత్రమే కాకుండా తల్లిదండ్రుల పేర్లను ప్రతిబింబించాలని కోర్టు పేర్కొంది. విద్యార్హతకు సంబంధించిన ఏదేని సర్టిఫికెట్‌లో తండ్రి పేరును మాత్రమే పేర్కొనడం సహేతుకమైన నిర్ణయం  కాదని జస్టిస్ సి హరిశంకర్ అన్నారు. "తల్లి పేరును మినహాయించడం స్పష్టంగా తిరోగమనం అవుతుంది.." అని జస్టిస్ పేర్కొన్నారు.