మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ తో కేసీఆర్ భేటీ

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ తో  కేసీఆర్ భేటీ

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు.  బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక  విమానంలో ముంబైకి వెళ్లారు. ముంబై ఎయిర్ పోర్ట్ నుంచి హోటల్ కు వెళ్లిన సీఎం కేసీఆర్ కు.. నటుడు ప్రకాశ్ రాజ్ వెల్ కమ్ చెప్పారు. హోటల్లో కొద్దిసేపు ఉన్న సీఎం కేసీఆర్... ఆ తర్వాత మహారాష్ట్ర  సీఎం, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే నివాసానికి చేరుకున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రుల కలిసి లంచ్ చేశారు. తర్వాత సీఎంల భేటీ కొనసాగుతోంది. జాతీయ రాజకీయాలు, రాష్ట్రాల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై ఇద్దరు నేతలు చర్చించిస్తున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర సీఎంతో భేటీ తర్వాత సాయంత్రం NCP అధినేత  శరద్ పవార్ తోనూ కేసీఆర్ సమావేశం కానున్నారు. సీఎం కేసీఆర్ వెంట ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కవిత ఉన్నారు.