ఏంటీ కాలం : ఎద్దులా కుమ్మి కుమ్మి మనిషిని చంపిన గాడిద

ఏంటీ కాలం : ఎద్దులా కుమ్మి కుమ్మి మనిషిని చంపిన గాడిద

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో గాడిద దాడి చేయడంతో ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన కొల్హాపూర్‌లోని గాంధీనగర్ ప్రాంతంలో జూలై 6న చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక వ్యక్తి వీధిలో నడుచుకుంటూ వెళుతుండగా, రోడ్డు పక్కన గాడిద నిలబడి ఉన్నట్టుగా ఈ వీడియోలో చూడవచ్చు. ఆ మనిషి గాడిదను దాటి వెళ్తుండగానే గాడిద దాడి చేసింది. వృద్ధుడిని రక్షించే ప్రయత్నంలో పలువురు గాయపడ్డారు.  

గత మూడు రోజుల్లో ప్రజలపై గాడిదలు దాడి చేయడం ఇది రెండోసారి. ఈ వీడియో బయటకు రావడంతో ఆ ప్రాంత ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. గతంలో ఇదే ప్రాంతంలో కుక్కల దాడిలో కనీసం 13 మంది గాయపడ్డారు. ఈ తరహా జంతువుల దాడులు జరుగుతున్నాయని స్థానికులు, అధికారులకు నిత్యం ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.