
పుణె : మహారాష్ట్ర ప్రభుత్వం టీచర్ల కు డ్రెస్కోడ్నిర్ణయించింది. మహిళ, పురుష టీచర్లకు వేర్వేరు డ్రెస్కోడ్లు సూచిస్తూ విద్యాశాఖ శనివారం రెజల్యూషన్‌ను జారీ చేసింది. ఇకపై మహిళా టీచర్లు టీ షర్ట్స్, జీన్స్, డిజైన్లు, బొమ్మలు ఉన్న డ్రెస్సులతో స్కూళ్లకు రావొద్దని సూచించింది. మేల్ టీచర్లు షర్ట్, ప్యాంట్ ధరించాలని, నీట్‌గా టక్చేసుకోవాలని వెల్లడించింది. మహిళా టీచర్లు చీర, సల్వార్, చుడిదార్, కుర్తాతో పాటు దుపట్టా ధరించాలని పేర్కొంది. కలర్‌ను పాఠశాలలే నిర్ణయించుకోవచ్చని చెప్పింది. అయితే, మేల్టీచర్ల షర్ట్లైట్కలర్లో, ప్యాంట్ముదురు కలర్లో ఉండాలని సూచించింది.